Sunday, December 22, 2024

ముంబ్రా స్టేషన్‌లో పట్టాలు తప్పిన రైలు

- Advertisement -
- Advertisement -

ముంబై :థానే జిల్లాలోని ముంబ్రా రైల్వే స్టేషన్‌లో బుధవారం సాయంత్రం లోకల్ రైలు పట్టాలు తప్పింది. వేలాది మంది ప్రయాణికులు రాత్రిపూట వేచి ఉన్న దశలో ఈ ఘటన జరగడంతో అంతా భయభ్రాంతులు అయ్యారు.ముంబ్రా స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్ 1 వద్ద సిఎస్‌ఎంటి నుంచి టిత్వాలకు వెళ్లే రైలు భాగానికి ప్లాట్‌ఫాం తగిలింది. దీనితో పట్టాలు తప్పిందని తరువాత అధికారులు తెలిపారు. ఓ గంట సేపు రైలును నిలిపివేసి పూర్తి తనీఖీల తరువాత తిరిగి ప్రయాణం సాగింది. చాలా మంది ప్రయాణికులు రైలులో నుంచి దూకి బయటకు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News