Monday, December 23, 2024

విండీస్ టి20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తిలక్ వర్మకు చోటు

- Advertisement -
- Advertisement -

తిలక్ వర్మకు చోటు
రోహిత్, కోహ్లిలకు విశ్రాంతి, హార్దిక్‌కు కెప్టెన్సీ
విండీస్ టి20 సిరీస్‌కు టీమిండియా ఎంపిక
ముంబై: వెస్టిండీస్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం బుధవారం టీమిండియాను బిసిసిఐ ప్రకటించింది. తెలుగుతేజం, హైదరాబాదీ స్టార్ బ్యాటర్ తిలక్‌వర్మకు భారత జట్టులో చోటు లభించింది. ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన తిలక్‌వర్మ మెరుగైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. దీంతో అతనికి తొలిసారి టీమిండియాలో చోటు దక్కింది. ఇక సిరీస్‌లో సీనియర్లు విరాట్ కోహ్లి, రోమిత్ శర్మలకు విశ్రాంతి ఇచ్చారు.

హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ తదితరులకు జట్టులో చోటు లభించింది. ఇదిలావుంటే విండీస్ సిరీస్ కోసం ఇప్పటికే టెస్టు, వన్డే జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా బిసిసిఐ సెలెక్షన్ కమిటీ నూతన చైర్మన్‌గా ఎంపికైన అజిత్ అగార్కర్ సారథ్యంలో టీమిండియా టి20 టీమ్‌ను ఎంపిక చేశారు.

జట్టు వివరాలు: హార్దిక్ పాండ్య (కెప్టెన్), సూర్యకుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, జైస్వాల్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్, బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ , అవేశ్ ఖాన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News