Monday, December 23, 2024

మూత్రం బాధితుడి కాళ్ళు కడిగి సన్మానించిన మధ్యప్రదేశ్ సిఎం.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మూత్రం బాధితుడి కాళ్ళు కడిగి సన్మానించారు. ఇటీవల సిద్ధి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు ప్రవేశ్ శుక్లా, ఓ గిరిజన వ్యక్తి మీద మూత్రం పోస్తూ పైశాచికంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియోను ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ట్యాగ్ చేస్తూ.. సదరు వ్యక్తిపై, బిజెపిపై తీవ్ర స్థాయిలో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ ఆదివాసి వ్యక్తిని తన నివాసానికి పిలుపించుకుని అతని కాళ్లను కడిగి సన్మానించారు. ఆదివాసీపై మూత్ర విసర్జన చేసి పైశాచికంగా వ్యవహరించిన ప్రవేశ్ శుక్లాపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అతని ఇంటిని కూల్చివేశారు.

Also Read: గిరిజనుడిపై మూత్ర విసర్జన.. బిజెపి నేత అరెస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News