- Advertisement -
అమరావతి: విజయవాడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అమ్మిన చీరల బకాయి సొమ్ము అడిగినందుకు ధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడ వస్త్ర దుకాణ వ్యాపారి దాడి చేశాడు. ఇద్దరు వ్యాపారుల బట్టలు ఊడ దీసి దారుణంగా దాడి చేస్తూ వారి వీడియోలు తీశాడు.
ఆ వీడియోలను ధర్మవరంలోని వ్యాపారులకు పంపించి పైశాచికంగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన బెజవాడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -