Saturday, November 23, 2024

నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో న్యాయం చేస్తున్నాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల రాజన్న: నీళ్లు, నియామకాలు, నిధుల విషయంలో న్యాయం చేస్తున్నామని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం సిరిసిరిల్లలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. “పోడు భూములు పట్టాలుగా ఇచ్చిన నాయకుడు కేసిఆర్ ఒక్కరే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1600 మందికి పట్టాలు ఇస్తున్నాం. పోడు భూముల పట్టాలకు రైతుబంధు కూడా ఇస్తున్నాం. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు సిఎం కెసిఆర్ రూ.73వేల కోట్లు వేశారు. కుమురం భీం నినాదం జల్, జంగిల్, జమీన్ ను సాకారం చేస్తున్నా. 300పైగా తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం. ఆరు శాతంగా ఉన్న ఎస్టి రిజర్వేషన్ ను 10శాతానికి పెంచాం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ తోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: పాతబస్తీలో విద్యుత్ చౌర్యం.. ఆరికట్టడానికి వెళ్లిన ఉద్యోగులపై ఎంఐఎం నేత దాడి.. (వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News