క్రొయేషియాలోని జాదర్ నుండి ర్యాన్ ఎయిర్ విమానంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 27 ఏళ్ల వ్యక్తి విమానం మధ్యలో తలుపు తెరవడానికి ప్రయత్నించడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. అతను టేకాఫ్ సమయంలో విమానం తలుపు తెరవడానికి ప్రయత్నించి ప్రయాణికులను ఇబ్బంది కలిగించాడు. ఈ ఘటన తర్వాత బ్రిటిష్ బాక్సర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, వ్యక్తి ప్యాక్ చేసిన ర్యాన్‌ఎయిర్ విమానంలో తన సీటు నుండి లేచి మరీ అంతరాయం కలిగించాడు. అతను తన సన్ గ్లాసెస్ తీసివేసి, తలుపు తెరవమని సిబ్బందిని డిమాండ్ చేశాడు. అతను తలుపు వైపు వెళ్ళే ముందు ఇతర ప్రయాణీకుల వైపు విచిత్రంగా సైగలు చేశాడు. పదేపదే “తలుపు తెరవండి” అని అరిచాడు. అకస్మాత్తుగా, ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు వారి సీట్ల నుండి లేచి, అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
ఈ ఘటన జరిగినప్పుడు విమానం రన్‌వేపై కదులుతూ లండన్‌కు బయలుదేరేందుకు సిద్ధమైంది. జూన్ చివరిలో పాగ్ ద్వీపంలో జరిగిన హైడ్‌అవుట్ క్రొయేషియన్ మ్యూజిక్ ఫెస్టివల్ నుండి చాలా మంది ప్రయాణికులు తిరిగి వస్తున్నారు. ఇంకా, బ్రిటీష్ బాక్సర్‌ను విమానం నుండి తొలగించారు. అరెస్టును ప్రతిఘటించిన తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం, అతను ఒక అధికారిపై దాడి చేసినట్లు అనుమానంతో కస్టడీలో ఉన్నాడని అధికారులు వెల్లడించారు.
🇭🇷🇬🇧 A British tourist tried to open the door on a crowded Ryanair plane flying from Zadar in Croatia.
When he ran to the door, two young men jumped on him and threw him to the floor. pic.twitter.com/taUp4nzkpD
— Winnie Pooh (@WinniePooh14466) July 3, 2023