బెంగళూరు: కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవు కర్ణాటక లోని తీర ప్రాంతమైన దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రాథమిక, ఉన్నత, పీయు, డిగ్రీ కళాశాలలకు గురువారం కూడా సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, నదీ, సముద్ర తీరాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మత్స కారులు చేపల వేటకు వెళ్లరాదని దక్షిణ కన్నడ జిల్లా అధికారి ముళ్లై ముగిలన్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా నోడల్ అధికారులను నియమించామన్నారు. సూరత్కల్ వద్ద సముద్ర తీరం లోని ఓ విద్యుత్ స్తంభం కూలి కుష్టగికి చెందిన సంతోష్ అనే 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఉడుపి జిల్లాలో అర్చకుడు నదిలో కొట్టుకు పోయాడు. కుందాపుర తాలూకా కమలశిలె లో నీటిలో కొట్టుకుపోయి శేషాధ్రి ఐతాల్ (75) మృతి చెందాడు. కుందాపుర తాలూకా తక్కెట్టిలో దివాకర్ శెట్టి అనే హోటల్ కార్మికుడు మంగళవారం రాత్రి స్కూటర్‌పై వెళ్తుండగా అదుపు తప్పి చెరువులో పడి మృతి చెందాడు.