Saturday, December 21, 2024

బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన మనీష్ సిసోడియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి , ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా బెయిల్ కోసం గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సిసోడియాను ఫిబ్రవరి 26న సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మే 9న ఈడీ అధికారులు అరెస్టు చేసి తీహార్ జైలులో ఉంచారు. గత మే 30న బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా నిరాశే ఎదురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News