Friday, November 15, 2024

హైకోర్టు సిజెగా అలోక్ అరదే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సిజెల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే, ఎపికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను కొలీజియం సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరదే 2009లో అక్కడి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.

జమ్మూకాశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2013లో అక్కడి హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2022 జూన్ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను మణిపూర్ హైకోర్టు సిజెగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దానిని కొలీజియం రద్దు చేసింది. తాజాగా ఎపి హైకోర్టు సిజెగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను సిఫార్సు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News