Wednesday, April 2, 2025

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా వి.భూపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:   తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంఎల్‌సి వి. భూపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు. సభ్యులుగా హైదరాబాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణ్‌పేట్ జిల్లా మద్దూర్ మండలం రెనెవట్లకు చెందిన మహమ్మద్ సలీంలు నియమితులయ్యారు. అలాగే తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మార్వెల్లికి చెందిన మఠం భిక్షపతి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మొహమ్మద్ తన్వీర్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించారు.

Matham Bikshapati

Mohmmed Tanveer

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News