- Advertisement -
రంగారెడ్డి: హైదరాబాద్-గుంటూరు వెళ్తున్న ఆర్‌టిసి బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ ఒఆర్‌ఆర్ వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సమాచారం మేరకు అగ్ని ప్రమాద సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అగ్నిప్రమాదంలో బసు పాక్షికంగా దగ్ధమైంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎసిలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు.
Also Read: ప్రియుడి కోసం వచ్చి ఇరుక్కుపోయిన పాకిస్తాన్ ప్రియురాలు
- Advertisement -