Friday, November 22, 2024

ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

తానూర్ : మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఉదయం మండలంలోని ఝరి (బి), ఝరి తాండ హిప్నెల్లి తాండా గ్రామాల ఆదివాసి గిరిజన లబ్ధిదారులకు పోడు పట్టాలను ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచని పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి కెసిఆర్ పరిష్కరించి గిరిజనులకు అందించిన ఘనత కేసి ఆర్‌దేనని తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారని, ఈ పోడు భూమి పట్టాలకు రైతుబంధు రైతుబీమా వర్తిస్తుందని తెలిపారు. గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాడేవార్ విఠల్, ఎంపిడివో శ్రీనివాస్, ఎంపివో మోహన్ సింగ్, తానూర్ ఎస్‌ఐ విక్రమ్, ఆర్‌ఐ గంగాధర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నంద్యా నాయక్, మాజీ ఎంపిపి రాజనన, పీఏసీఎస్ చైర్మన్ నారాయణ రావు పటేల్, వైస్ ఎంపిపి చంద్రకాంత్, కోఆప్షన్ సభ్యులు గోవింద్ పటేల్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోతా రెడ్డి, బిఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, తానూర్ ఉప సర్పంచ్ నాయూమ్ ఖాన్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ధర్మోడ్ సుభాష్, పవార్ భీమ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఏఈవోలు బిఆర్‌ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News