Friday, November 22, 2024

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః హైదరాబాద్‌లోని పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్జాతీయ ముఠాను హెచ్‌న్యూ, బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 100గ్రాములు కొకైన్, 300గ్రాములు ఎండిఎంఏ, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ కోటి రూపాయలు ఉంటుంది. ఐసిసిసిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన అగ్‌బో మ్యాక్స్‌వెల్ నబుసీ అలియాస్ క్వేకు ఇస్సుమన్ క్వామే, ఇకెం ఆస్టిన్ ఒబాక, ఒకే చిగోజి బ్లెసింగ్, హైదరాబాద్‌కు చెందిన సాయి ఆకేష్, సంజయ్ సునీల్ కుమార్, తుమ్మ భానుతేజ రెడ్డి,మాజీని అరెస్టు చేశారు. మ్యాక్స్‌వెల్ 2011లో మెడికల్ వీసాపై ముంబాయికి వచ్చాడు. ఒకె చిగోజి బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చి తమిళనాడు, త్రిపూర్‌లో ఉంటున్నాడు.

ఆస్టిన్ ఒబాకా స్టూడెంట్ వీసాపై వచ్చి బెంగళూరులో ఉంటున్నాడు. మ్యాక్స్‌వెల్ ముంబాయికి రాగానే డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. కొద్ది రోజులు డ్రగ్స్ విక్రయించిన తర్వాత పోలీసులకు పట్టుబడతామని భావించి బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరుకు వచ్చిన తర్వాత నకిలీ అడ్రస్ క్రియేట్ చేసి నకిలీ పాస్‌పోర్టును తీసుకున్నాడు. దాని ద్వారా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశాడు. వాటి ద్వారా డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు నిర్వహించాడు. బెంగళూరులో మాజీతో కలిసి విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇలా కోట్లాది రూపాయలను సంపాదించారు. ఆన్‌లైన్‌లో మ్యాక్స్‌వెల్‌కు డబ్బులు రాగానే నిర్మానుష్య ప్రాంతంలో డ్రగ్స్ ప్యాకెట్లను వేసి వచ్చిన తర్వాత వారికి సమాచారం ఇచ్చేవాడు. నిందితుడు పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వర్చువల నంబర్ల ద్వారా ఫోన్‌లో మాట్లాడేవాడు.

మిగతా నైజీరియన్లను డ్రగ్స్ విక్రయించేందుకు సహకరించాలని దానికి కమీషన్ ఇస్తానని చెప్పడంతో నిందితుడితో వారు చేతులు కలిపారు. అందరు కలిసి దేశవ్యాప్తంగా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఘనా దేశానికి చెందిన ఫెలిక్స్ అవున్యోను తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. నిందితులను ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సై జిఎస్ డానియల్ తదితరులు పట్టుకున్నారు.
పట్టుబడ్డది ఇలా….
నగరానికి చెందిన ఎం. సంజయ్ సునీల్ కుమార్, తుమ్మ భాను తేజ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టకున్నారు. వారిని విచారించగా నైజీరియాకు చెందిన డ్రగ్స్ ముఠా గురించి తెలిసింది. దీంతో నగరానికి చెందిన హెచ్ న్యూ పోలీసులను బెంగళూరుకు పంపించి నిందితులను వలవేసి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News