Monday, December 23, 2024

మూత్ర విసర్జన ఘటన బాధితుడికి రూ.6.5 లక్షల ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయ దుమారానికి దారి తీసింది. దీంతో రాష్ట్రంలోని బిజెపి దిద్దుబాటు చర్యలు చేపట్టడం మొదలు పెట్టింది. గురువారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌చౌహాన్ బాధితుడు దశమత్ రావత్ నివాసానికి వెళ్లి స్వయంగా ఆయన పాదాలను కడగడమే కాకుండా ఈ ఘటనపై ఆయనకు క్షమాపణ కూడా చెప్పారు.

కాగా ముఖ్యమంత్రి ఆదేశాలతో రావత్‌కు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని , ఇల్లు నిర్మించుకోవడానికి మరో రూ.1.5 లక్షలు మంజూరు చేసినట్లు సిధి జిల్లా కలెక్టర్ శుక్రవారం తెలియజేశారు. కాగా బాధితుడిపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై పోలీసులు ప్రకాశ్ శుక్లా అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేసి అతనిపై ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టంతో పాటుగా జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News