Tuesday, December 24, 2024

కర్నాటక అసెంబ్లీకి ఎమ్మెల్యేకాని వ్యక్తి సెషన్‌ను చూస్తూ గడిపిన చిత్రదుర్గ వాసి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం అయ్యాయి. ఆర్థిక శాఖను నిర్వహిస్తోన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే సందట్లో సడేమియాగా ఓ 70 ఏండ్ల వ్యక్తి తనను తాను ఎమ్మెల్యేనని తెలియచేసుకుంటూ సభలోకి రావడం, ఓ సభ్యురాలి సీట్లో కూర్చుని సభా కార్యక్రమాలను చూస్తూ గడపడం సంచలనం కల్గించింది. సభ్యులంతా బడ్జెట్ పత్రాలను చూస్తున్న దశలోనే ఈ వ్యక్తి సభలో ఖాళీగా ఉన్న జెడిఎస్ ఎమ్మెల్యే కరియమ్మ సీట్లో కూర్చున్నారు.

అయితే పక్క సీట్లోని మరో ఎమ్మెల్యేకు ఈ వ్యక్తిపై అనుమానం వచ్చి, విషయాన్ని అసెంబ్లీ సిబ్బందికి తెలిపారు. దీనితో వారు వచ్చి ఆయనను బయటకు తీసుకువెళ్లి విచారించారు. దీనితో ఆయన ఎమ్మెల్యే కాదని తేలింది. ఈ వ్యక్తిని చిత్రదుర్గ జిల్లాకు చెందిన వాడినని , బడ్జెట్ సెషన్ చూడటానికి లోపలికి వెళ్లానని, లోపలికి వెళ్లేందుకు వీలుగా ఉండటంతో వెళ్లి ఖాళీ సీట్లో కూర్చున్నానని, ఈలోగా బడ్జెట్ సమర్పణ జరిగిందని ఈ ముసలాయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అసెంబ్లీ భద్రత ఈ విధంగా ఉందని ప్రతిపక్ష బిజెపి నేతలు వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News