గోదావరిఖని: సిఎం కెసిఆర్ పాలనను యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సిఎం కెసిఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్ర చంద్రాపూర్ వాసులు బాబారాం మస్కి, శోభారాణి దంపతులు చంద్రాపూర్ నుంచి హైదరాబాద్ ప్రగతి భవన్ వరకు సంకెళ్లతో చేపట్టిన పాదయాత్రను శుక్రవారం రామగుండం నియోజక వర్గానికి చేరుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని స్వాగతించారు. రాబోయే కాలంలో మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, గులాబీ జెండా ఎగురుతుందని ఆయన ఆభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కొమ్ము వేణుగోపాల్, దొంత శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, అడ్డాల గట్టయ్య, నాయకులు తోడేటి శంకర్ గౌడ్, నూతి తిరుపతి, జెవి రాజు, కలువల సంజీవ్, రాకం వేణు, కెక్కర్ల రాజ్‌కుమార్, అచ్చవేణు, ధరణి జలపతి, దొమ్మేటి వాసు తదితరులున్నారు.
బిఆర్‌ఎస్‌లో పలువురి చేరికలు…
అంతర్గాం మండలం మద్దిర్యాల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ముక్కెర సీతారామయ్య, లగిశెట్టి రాంకిషన్, ఎల్కలపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఉదయ్, బిజెపి నాయకుడు అంజిలు ఎమ్మెల్యే చందర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీమేయర్ నడిపల్లి అభిషేక్ రావు, నాయకులు తిరుపతి నాయక్, జూల లింగయ్య, బోండా అశోక్, ఎనగందుల శ్రీనివాస్, సంతోష్, బెంద్రం రాజిరెడ్డి, దొమ్మేటి వాసు, ఇరుగురాల శ్రావణ్ తదితరులున్నారు.