స్టేషన్ ఘన్‌పూర్ : స్టేషన్ ఘన్‌పూర్ బిఆర్‌ఎస్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. కడియం వర్సెస్ రాజయ్య వర్గాల మధ్య పోటాపోటీ నెలకొంది. శుక్రవారం మండలంలోని తాటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన దళితుల ఆత్మీయ సభలో సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య ఫైర్ అయ్యారు. ఆయన దేవాదుల సృష్టికర్త కాదని, ఎన్ కౌంటర్ల సృష్టికర్త అంటూ కామెంట్స్ చేశారు. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండలో నిర్వహించిన ఆది జాంబవుని విగ్రహ భూమిపూజ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సకల జనుల సమ్మెలో కాంగ్రెస్ నుంచి రాజయ్య రాజీనామా చేస్తే కడియం శ్రీహరి పోటీ చేయనన్నారాని గుర్తు చేశారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళగా మొట్టమొదట టిడిపి నుండి నామినేషన్ వేశాడు. కులం అనేది ఆత్మగౌరవంతో సమానం.. కుల ప్రస్తావన జరగాలి.. పార్టీ నుండి బహిష్కరించిన వారే కడియం వెంట ఉన్నారు. నియోజకవర్గ ప్రజలు నా వెంట ఉన్నారని స్పష్టం చేశారు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని వెంటనే సస్పెండ్ చేయాలని మండి పడ్డారు. ఆడియోలు, వీడియోలు అంటూ నాపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటా అని రాజయ్య పేర్కొన్నారు. నియోజకవర్గంలో 85 వేల ఎస్సీల ఓట్లు ఉంటే… 68వేలు ఓట్లు మాదిగలవే అని ఈ సందర్భంగా చెప్పారు.