కరీంనగర్: ప్రతి మనిషి చేరే చివరి చోటు అందంగా అహ్లాదకరంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ దామాల సుందరీకరణకు శ్రీకారం చుట్టిందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధి లో బాగంగా శుక్రవారం రోజు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్ 42 వ డివిజన్, 22 వ డివిజన్ పరిదిలోని ఆదర్శనగర్ వైకుంఠ దామాన్ని సందర్శించారు.
కార్పోరేటర్ మేచినేణి వనజ అశోక్ రావు కార్పోరేటర్ గంట కళ్యాణీ శ్రీనివాస్ తో కలిసి ఆదర్శనగర్ స్మశాన వాటికలో కల్పించే పలు వసతి సౌకర్యాలకు సంబందించిన అభివృద్ధి పనులకు నగరపాలక సంస్థ కు 25 లక్షల రూపాయల నిధులతో భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఉన్న కుల మతాలకు అతీతంగా అన్ని వైకుంఠ దామాలను నగరపాలక సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలా స్మశాన వాటికలను అభివృద్ధి చేసి… అందులో ప్రజలకు ఇబ్బందులు రాకుండా వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా ఉన్న స్మశాన వాటికల అభివృద్ధి కోసం దాదా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు.
ప్రతి స్మశాన వాటికలో బర్నింగ్ ప్లాట్ ఫాం, స్నాన గదులు, మరుగు దొడ్లు, అస్తికల బద్రపరిచేందుకు ప్రత్యేక లాకర్లు, కర్మ ఖాండ కార్యక్రమాల కోసం ప్రత్యేక గదులు, మంచి నీరు లాంటి సౌకర్యాలు కల్పించి గ్రీన్, మొక్కలు, పౌంటెన్ లాంటి వి ఏర్పాటు చేసి వచ్చే వారికి అహ్లాదం పంచే విధంగా సుందరీకరించామన్నారు. అలాగే ఆదర్శనగర్ వైకుంఠ ధామంలో కార్పోరేటర్ల కోరిక ప్రకారం వసతి సౌకర్యాల ఏర్పాటుకు భూమీ పూజ చేశామన్నారు.
ఈ వైకుంఠ దామంలో బర్నింగ్ ప్లాట్ ఫాం తో పాటు లైటింగ్, గేట్లు మరియు ఇతర సౌకర్యాలన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ నగరంలోని వైకుంఠ దామంలో ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలకు మా పాలకవర్గాని అభినందనలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా పనులు చేపట్టిన అల్కపురి, మార్కండేయ నగర్, మానేరు వాగు తదితర వైకుంఠ దామాల న్నిటిలో పనులు పూర్తై సుంధరంగా అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ నాగమల్లేశ్వర్ రావు, ఈఈ మహేంధర్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.