Saturday, December 21, 2024

దుర్గం చెరువు అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోన్న మాధాపూర్‌లోని దుర్గం చెరువును మరింతగా అభివృద్ధి చేస్తామని
తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హుస్సేన్ సాగర్ తరహాలో హైదరాబాద్‌లో నెంబర్ 1 పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువు అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. వర్షాకాలం నేపథ్యంలో దుర్గం చెరువుకు వచ్చే పర్యాటకులకు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అక్కడి సిబ్బందికి సూచించారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో పర్యాటకులను అమితంగా ఆకర్షించే తెలంగాణ టూరిజం పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువుని గెల్లు శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. కాలినడకన దుర్గం చెరువు మొత్తం కలియతిరిగుతూ రాక్ గార్డెన్, ఫ్లోటింగ్ ఫౌంటెన్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ఇంకా రాపెల్లింగ్ వంటి ప్రదేశాలను సందర్శిస్తూ సిబ్బందితో మాట్లాడి పర్యాటకులకు కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బోటింగ్ చేస్తున్నపుడు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన టూరిస్టులకు గుర్తుచేశారు. పర్యాటకులకు కల్పించే సదుపాయలపై ఏ అవసరం ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బోటింగ్‌కు పర్యాటకులు ఆసక్తిని చూపడాన్ని గుర్తు చేస్తూ బోట్ల పనితీరును
ఆయన పరిశీలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News