- Advertisement -
ఘట్కేసర్: ఆరోగ్య సమస్యలతో మనస్థాపం చెంది ఓ రైల్వే ఉద్యోగి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్కేసర్ మున్సిపాలిటీ ఈడబ్లుఎస్ కాలనీకి చెందిన గ్యార రాజేందర్ (37) రైల్వేలో ట్రాక్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారని, గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బ ందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం మనస్థాపంలో ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలుక్రిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
- Advertisement -