- మార్కెట్ డైరెక్టర్ సురమళ్ల సుభాష్
ఆమనగల్లు: విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమనగల్లు మార్కెట్ డైరెక్టర్ సురమళ్ల సుభాష్ అన్నారు. నాలుగు మండలాలకు ప్రధాన కూడలి అయిన ఆమనగల్లు మండల కేంద్రంలో ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం విద్యార్థి యువజన సంఘం నాయకులతో కలిసి సురమళ్ల సుభాష్ విలేకరులతో మాట్లాడారు. కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ సారథ్యంలో ఆమనగల్లు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 2018 ఎన్నికల సందర్భంగా ఆమనగల్లులో నిర్వహి ంచిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఇచ్చిన హమీ మేరకు ఆమనగల్లులో పాలిటెక్నిక్ కళాశాల మంజూరైందని తెలిపారు.ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల, తలకొండపల్లి, వెల్దండ, కందుకూరు ప్రాంతాల బడుగు, బలహీన వర్గా ల విద్యార్థులు పాలిటెక్నిక్ చదువుకోవడానికి వీలుగా ఈ సువర్ణ అవకాశం కలిగిందని పేర్కొన్నారు.
డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, కృషి చేసిన ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జంతుక కిరణ్, సుమన్‌నాయక్, వడ్డెమోని శివకుమార్, లండం శివకుమార్, కళ్యాణ్‌నాయక్, తదితరులున్నారు.