Sunday, December 22, 2024

షిండేతోసహా శివసేన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో 40 మంది శివసేన ఎమ్మెల్యేలకు, ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది శివసేన ఎమ్మెల్యేలకు వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లకు సమాధానాలు కోరుతూ నోటీసులు జారీచేసినట్లు అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ శనివారం తెలిపారు.

భారత ఎన్నికల కమిషన్ నుంచి శివసేనకు చెందిన నిబంధనావళి ప్రతి తనకు అందిందని, ముఖ్యమంత్రి షిండేతోసహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ త్వరలో ప్రారంభమవుతుందని స్పీకర్ నర్వేకర్ ప్రకటించినమరుసటి రోజే వీరందరికీ నోటీసులు జారీ కావడం గమనార్హం.

శివసేన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హతా పిటిషన్లను త్వరితంగా విచారించాలని ఉద్ధవ్ థాక్రే వర్గం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2022 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి మరో 15 మంది ఎమ్మెల్యేలతో కలసి వేరుపడిన షిండే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అవిభక్త శివసేనకు చీఫ్ విప్‌గా ఉన్న ఎమ్మెల్యే సునీల్ ప్రభు ఆ హోదాలో షిండే, మరో 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ స్పీకర్ వద్ద పిటిన్లు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News