Monday, December 23, 2024

నిండు బహిరంగ సభలో ఓటమి అంగీకరించిన మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లా నిండు బహిరంగ సభలో రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా భారీగా నిధులు ఇచ్చి , హామీలు కురిపించే నరేంద్ర మోడీ వరంగల్ సభలో ఒక్క రూపాయి ప్రకటించలేదని ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణలో బిజెపి గెలిచే అవకాశాలు లేవని భావించిన మోడీ నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా చప్పగా ప్రసంగించారని ఎద్దేవా చేశారు.  మోడీతో సహా ఢిల్లీ బిజెపి నేతలంతా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్ర హక్కుని విభజన చట్టం, పార్లమెంట్‌లో ఆమోదం మేరకే రాష్ట్రానికి జాతీయ రహదారులు మంజూరు చేశారని, ఉద్యోగాల కామన్ రిక్రూట్మెంట్ బిల్లును గవర్నర్ చేత తొక్కిపెట్టి ఇప్పుడు యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బిజెపిలోనే 200 మంది వరకు నాయకుల వారసులు రాజకీయాల్లో ఉన్నారని, వారసత్వ రాజకీయాలపై మాట్లాడే అర్హత మోడీకి లేదని పేర్కొన్నారు. .కొన్ని ట్రైలర్లు ట్రైలర్స్ కే పరిమితం అవుతాయని, సినిమాలు మాత్రం విడుదల కావు బిజెపి ట్రైలర్ కూడా అలాంటిదేనని చురక వేశారు. రాష్ట్ర గ్రామ పంచాయతీలకు అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి ఇప్పుడు తెలంగాణాలో అభివృద్ధి లేదనడం మోడీ ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News