Sunday, November 24, 2024

యువతకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

ధర్మపురి: నిరుద్యోగ యువతి, యువలకు ఉద్యోగ కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో పర్యటించారు. ధర్మపురి పట్టణంలోని నైట్ కాలేజీలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్‌ల ట్రైనింగ్ సెంటర్‌ను మంత్రి ప్రారంబించారు.

అనంతరం ధర్మపురిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 139 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 45.94 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత చదువుతో పాటు, ఎదో ఒక పనిలో నైపుణ్యం పొందినప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు.

రాష్ట్రంలో కుట్టు మిషన్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, వెల్డింగ్, పెయింటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్నవారి కొరత ఎక్కువగా ఉందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురిలో న్యాక్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంబించిందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వివిధ మండలాల్లో శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయని, వెల్గటూర్‌లో సైతం కొద్ది రోజుల్లో ప్రారంబిస్తామన్నారు.

న్యాక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందవచ్చన్నారు. న్యాక్‌లో చేరిన వారికి శిక్షణతో పాటు కుటుంబ ఖర్చుల కోసం రోజుకు రూ. 300 చెల్లిస్తారన్నారు. న్యాక్ యువతకు శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో వెలుగును నింపుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసిన యువత దేశ విదేశాల్లో ఉపాధి పొందవచ్చన్నారు.

అదే విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలు అందిస్తున్న సహాయం ఒక పుణ్యకార్యం లాంటిదన్నారు. మొండి రోగాలతో పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో చేరిన పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించి వారి ప్రాణాలు కాపాడుతుందన్నారు. నియోజవర్గ మొత్తంలో ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్‌ఓసీ ద్వారా 28 వేయిల మందికి రూ. 74 కోట్లు విలువ చేసే చెక్కులను మంజూరు చేయించానన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎక్కువ సహాయం పొందిన వారిలో రాష్ట్రంలో మనమే ముందుంటామన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద మనుసుతో తమ ద్వారా ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, బుగ్గారం ఎంపీపీ బాదినేని రాజమణి, జెడ్పీటీసీ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందారపు రామన్న, ఎఎంసీ చైర్మన్ రాజేష్, నియోజకవర్గంలోని వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు, న్యాక్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News