Friday, November 22, 2024

బాలుర వసతి గృహానికి నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కోటి 72 లక్షల నిధులతో జిల్లా కేంద్రంలో బాలుర వసతి గృహానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ధరూర్ క్యాంపు ఎస్టి బాలుర వసతి గృహంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన ఉలెన్ బ్లాంకెట్‌లను, నోట్ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు శనివారం జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన విద్య అందించడమే సిఎం కెసిఆర్ లక్షమని అన్నారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. గిరిజనులకు పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. శీట్ల భవాని, సంత్ సేవాలాల్, సమ్మక్క సారక్క, కొమురం భీమం జయంతి కార్య క్రమాలు ప్రభుత్వ పక్షాన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్‌టి, హాస్టల్స్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డెన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీలత రాంమ్మోహన్‌రావు, క్యాంప్ రామాలయం, చైర్మన్ నరేష్, కౌన్సిలర్ చాంద్ పాష, మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్, వొంటి పులి రాము, కౌన్సిలర్‌లు గుగ్గిళ్ల హరీష్, కూతురు రాజేష్, స్టాఫ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News