Sunday, January 19, 2025

తెలంగాణలో అంగన్‌వాడీలకు ప్రత్యేక గుర్తింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 50 సంవత్సరాలుగా ఒక స్కీం వర్కర్ల పేరుతో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందేలా పనిచేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. వారి సేవాలను గుర్తించే సిఎం కేసీఆర్ వేతనాలు పెంచారని రాబోవు రోజుల్లో ఒక పూర్వ ప్రాథమిక విద్య టీచర్ గా గుర్తించే స్థాయి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లోని క్లబ్ హౌస్ లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి అధ్యక్షతన జరిగింది.

ఈసందర్భంగా అంగన్‌వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని, పని లబ్ధిదారులకు టిహెచ్‌ఆర్ ఇచ్చి, అదనపు పనులు తగ్గించి పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. దీనికి వినోద్‌కుమార్ సానుకూలంగా స్పందిస్తూ అంగన్వాడి టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం బిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ ప్రసంగిస్తూ తమకు అనుబంధంగా అంగన్వాడీ యూనియన్ ఏర్పాటు చేసుకొని రిప్రెజెంటేషన్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో అంగన్వాడీ టీచర్ లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మహబూబాబాద్ జిల్లా అంగన్వాడీ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు సులోచన నేతృత్వంలో 40 మంది నాయకులు యూనియన్‌లో చేరారు.ఈ సమావేశంలో కనీస వేతన సలహా మండలి చైర్మన్ పి.నారాయణ , శివశంకర్, శంకర్ రెడ్డి, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలాస కవి నిర్మల, వేదవతి, రమాదేవి,అరుణ, విమలాదేవి, జక్కుల మంగమ్మ, రమాతార, నసీమ, ఉమాదేవి, ఎల్లమ్మ, రజిత, కవిత, సురేఖ, నాగలక్ష్మి,కమల తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News