Saturday, December 21, 2024

అత్తింటివారి కోపం..అల్లుడు ఉరేసుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పెద్దేముల్: అత్తింటివారు కోపంతో అన్నారని.. అల్లుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ విద్యాచరణ్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని జనగాం గ్రామానికి చెందిన అన్నసారం మాణేప్ప తన కూతురు బుజ్జమ్మను 12 ఏళ్ళ క్రితం తాండూరు మండలంలోని కొత్లాపూర్ కుర్దు గ్రామానికి చెందిన పెద్దకుర్వ గోపాల్‌కు ఇచ్చి వివాహం చేశారు. అయితే కొన్నాళ్ళ పాటుగా వారి సంసార జీవితం ప్రశాంతంగా సాఫీగా సాగింది. ఆ తర్వాత మరికొన్నాళ్ళకు గోపాల్ మద్యానికి భానిసై నిత్యం త్రాగుతూ భార్య బుజ్జమ్మను కొడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో వారి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి.
భార్యభర్తలు ఇద్దరు కూడా తరుచుగా గొడవ పడేవారు. దీంతో విసిగివేసారిపోయిన బుజ్జమ్మ 20 రోజుల క్రితం తల్లిగారి ఇల్లు జనగాంకు వచ్చింది.

నాటి నుంచి గోపాల్ అత్తగారి ఇంటికి వచ్చి తన భార్య బుజ్జమ్మను పంపాలని కోరగా పంపలేదు. ఈ క్రమంలోనే తల్లి లక్ష్మమ్మ గోపాల్ ఇద్దరు పిల్లలైనా భాగ్యలక్ష్మీ(10), మౌనిక(9) జనగాంలోని తల్లిగారి వద్ద ఉన్నటువంటి బుజ్జమ్మ దగ్గరకుఅస తీసుకొచ్చారు. దీంతో బుజ్జమ్మ.. ఇక్కడ నేనుండడానికే కష్టంగా ఉంది.. పిల్లలను ఎందుకు తీసుకొచ్చావ్.. పిల్లలను తీసుకెళ్ళాలని మృతుడు తల్లి లక్ష్మమ్మకు సూచించింది. దీంతో అమె వెనుదిరిగి కొత్లాపూర్ వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే గోపాల్ జనగాం గ్రామానికి వచ్చాడు. భార్య బుజ్జమ్మ, బావమరిది నర్సింహులు, మామ మాణేప్పలు గోపాల్‌తో గొడవపడ్డారు. “ఎందుకు బ్రతికినావ్ రా చావుపో” అంటూ గోపాల్‌ను దూషించడంతో మనస్థాపం చెంది సొంతమామ మాణేప్ప పొలంలోనే సీతాఫల్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్‌ఐ నారాయణ, సీనియర్ కానిస్టేబుల్ మున్నయ్యలు హుటహుటినా సంఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. ఈ మేరకు మృతదేహన్ని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించి.. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు బుజ్జమ్మ, నర్సింహులు, మాణేప్పలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News