Saturday, December 21, 2024

బిఆర్‌ఎస్‌లో చేరిన బిజెవైఎం నాయకుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి పార్టీ అనుబంధ సంస్థ బిజెవైఎం మహబూబ్ నగర్ జిల్లా సెక్రెటరీ దోమ సాయి కుమార్
బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర మంత్రి, మహబూబ్‌నగర్ ఎంఎల్‌ఏ వి. శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఆయన బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మహబూబ్ నగర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకు ఆకర్షితులై ఈ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ సందర్భంగా దోమ సాయి కుమార్‌కు బిఆర్‌ఎస్ కండువా కప్పి మంత్రి శ్రీనివాస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పురపాలక సంఘం కోఆప్షన్ సభ్యులు కె. రామలింగం, జాండ్ర సంఘం నాయకులు కె. పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News