Monday, December 23, 2024

ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వర లో వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఎసి చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలు 25 శాతం మేర తగ్గనున్నట్టు ఆ శాఖ ప్రకటించింది. వీటితో పా టు అనునుభూతి, విస్టాడోమ్ కోచ్‌ల్లో ఉన్నవాటికి ఆక్యుపెన్సీని బట్టి ఛార్జీలు 25 శాతం మేర తగ్గించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ముఖ్యంగా 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఈ మేరకు ఛార్జీలు తగ్గించాలని రై ల్వే జోన్లకు కేంద్రం సూచించింది. ఈ తగ్గిన ధర లు వెంటనే అందుబాటులోకి వస్తాయని ఇదివరకే టికెట్ బుక్ చేసుకున్న వారికి రిఫండ్ లభిస్తుందని తెలిపింది. డిస్కౌంట్ అనేది బేసిక్ ఫేర్‌లో గరిష్టంగా 25 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నారు.

హాలిడే, ఫెస్టివల్ స్పెషల్‌కు ఈ స్కీం వర్తించదు
రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జి, జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలు మాత్రం అదనంగా వర్తిస్తాయి. డిస్కౌంట్ నిర్ణయించే ముందు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆక్యుపెన్సీని బట్టి రైలు ప్రయాణించే మొత్తం దూరానికి, లేదా ఎంపిక చేసిన స్టేషన్ల మధ్య కూడా ప్రయాణానికి డిస్కౌంట్ వర్తింపజేస్తామని రైల్వే శాఖ తెలిపింది. హాలిడే, ఫెస్టివల్ స్పెషల్ రైళ్లకు ఈ స్కీం వర్తించదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

వర్షాలకు ఎసి బోగీలకు తగ్గిన డిమాండ్
దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. శనివారం ప్రధాని మోడీ ప్రారంభించిన గోరక్‌పూర్- లఖ్నవూ, జోధ్‌పూర్- సబర్మతీ రైళ్లతో కలిపి వివిధ రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్ల సంఖ్య 25 చేరింది. మరికొన్ని రైళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రధాన రూట్ల లో ఈ రైళ్లను నడుపుతున్నారు. కొన్ని రూట్లలో ఆదరణ బాగానే ఉన్నప్పటికీ మరికొన్ని రూట్లలో మాత్రం టికెట్ ధరలు అధికంగా ఉన్న కారణంగా ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ఎండలు తగ్గి వర్షాలు కూడా పడుతుండడంతో ఎసి బోగీల్లో ముఖ్యంగా చైర్‌కార్‌లో ప్ర యాణానికి ఆశించిన మేర ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు ఈ కొత్త పథకంతో ముందుకొచ్చింది.

కాసర్గోడ్, త్రివేండ్రం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆక్యుపెన్సీలో టాప్
ఆక్యుపెన్సీలో కాసర్గోడ్, -త్రివేండ్రం వందే భారత్ రైలు అగ్రస్థానంలో ఉంది. 183 శాతం ఆక్యుపెన్సీతో అన్ని రైళ్ల కంటే ఇది ముందుంది. త్రివేండ్రం,- కాసర్గోడ్ (176%), గాంధీనగర్-, ముంబయి సెంట్రల్ (134%), ముంబయి సెంట్రల్, – గాంధీనగర్ (129%), వారణాశి, – న్యూఢిల్లీ (128%), న్యూఢిల్లీ, వారణాశి (124%), డెహ్రడూన్- అమృత్‌సర్ (105%), ముంబై,- షోలాపూర్ (111%), షోలాపూర్-, ముంబై వందే భారత్ (104%) ఆక్యుపెన్సీ పరంగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News