Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురద జల్లెందుకే బిజెపి విజయ సంకల్ప సభ : మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురద జల్లెందుకే బిజెపి విజయ సంకల్ప సభ పెట్టిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బిఆరెఎస్ పాలన,ముఖ్యమంత్రి కెసిఆర్ పై బురద జల్లెందుకే బిజెపి విజయ సంకల్ప సభ పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని రాకను ముందే ప్రజలు వ్యతిరేకించారని, స్థానిక నేతలను సంతృప్తి పరిచేందుకే వరంగల్ సభకు హాజరయ్యారని ఆయనన్నారు. తెలంగాణ ప్రజలకు ఏ మేలుచేస్తామో, కొత్తగా ఏ పథకాలు అమలు చేస్తామో చెప్పలేదని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బిఆర్‌ఎస్ గెలుస్తుందని, మూడో సారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఇది ముందే గ్రహించిన బిజెపి తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ కు బిఆర్‌ఎస్ బి టీం అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ లబ్ది పొందాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఎవరు ఎవరికి బి టీంగా పనిచేస్తున్నారనేది ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయనన్నారు. ఎవరి పాలనలో ఏమి మేలు జరిగిందనేది ప్రజలే చెబుతున్నారన్నారు.

రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలు దేశం యావత్తు బిజెపి పాలిత రాష్ట్రలు సైతం ఆశ్చర్య పోతున్నాయన్నారు. సమ్మక్క సారాలమ్మ సాక్షిగా గిరిజనులకు అన్యాయం చేశారని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న పట్టించు కోలేదని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాలను ముఖ్యమంత్రి కెసిఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అభినందించాల్సిన ప్రధాని విషం చిమ్మటం సిగ్గు చేటని అన్నారు. పదే పదే ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తుండటం మన దౌర్బాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది ఎకరాల్లో పంట సాగు అవుతున్నది, దేశంలోనే తెలంగాణ లో అత్యధిక సాగు అవుతున్నట్లుగా గణంకాలు చెబుతున్నాయన్నారు. ఇది జీర్నించుకోలేని బిజెపి పెద్దలు బిఆర్‌ఎస్ పై అడ్డగోలు విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు మానుకొని ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేసి అభివృద్ధిలో బాగా స్వాములు అయితే ప్రజలు హర్షిస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News