- Advertisement -
హైదరాబాద్ : గాయకుడు సాయిచంద్ కుటుంబాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రం గూడాలోని ఆయన స్వగృహానికి వెళ్లి సాయిచంద్ సతీమణి రజినిని, కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతిని వ్యక్తం చేశారు సాయిచంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ వీరుడు, ఆటపాటలతో తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన గాయకుడు సాయిచంద్ అని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు.
- Advertisement -