Monday, December 23, 2024

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆదేశాల మేరకు శనివారం పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నాయకత్వం పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజాగా వివిధ రాష్ట్రాలకు చెందిన బిజెపి నేతలను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సోమ వీరరాజుతో పాటు వివిధ రాష్ట్రాల నేతలు సురేష్ కశ్యప్, డాక్టర్ సంజయ్ జైస్వాల్, విష్ణుదేవ్ సాయి, ధరమ్‌లాల్ కౌశిక్, అశ్విని శర్మ, దీపక్ ప్రకాష్, కిరోడి లాల్ మీనా డాక్టర్ సతీష్ పూనియాలను నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News