Monday, December 23, 2024

వాహనాల విక్రయాల్లో 10 శాతం వృద్ధి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గతేడాదితో పోలిస్తే గత నెలలో కార్లతో పాటు టూ వీలర్స్ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి నమోదైంది. 2022 జూన్‌లో 17,01,105 వాహనాలు అమ్ముడైతే, గత నెలలో 18,63,868 యూనిట్లు సేల్ అయ్యా యి. జూన్ వాహనాల విక్రయాలపై ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) నివేదిక విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే రిటైల్ వాహనాల విక్రయాలు ఎనిమిది శాతం తగ్గుముఖం పట్టాయి.

సమీప భవిష్యత్‌లో స్వల్పకాలం వాహనాల విక్రయాలు తగ్గుతాయని సంకేతాలు కనిపిస్తున్నా యి. జూన్ నెలలో 2,95,299 కార్ల విక్రయా లు జరిగాయి. 2022 జూన్‌లో 2,81,811 యూనిట్లతో పోలిస్తే ఐదు శాతం వృద్ధి. టూ వీలర్స్ సేల్స్ గతేడాది జూన్‌తో పోలిస్తే ఏడు శాతం పెరిగి 12, 27,149 యూనిట్ల నుంచి 13, 10,186 యూనిట్లకు చేరాయి. అనూహ్యంగా త్రీ వీలర్స్ విక్రయాల్లో 75 శాతం వృద్ధి రికార్డైంది.

2022 నెలలో 49,299 యూనిట్లు విక్రయమైతే, ఈ ఏడాది 86,511 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ల విక్రయాలు 45 శాతం వృద్ధి 98,660 యూనిట్లకు, కమర్షియల్ వాహనాలు 72,894 యూనిట్ల నుంచి స్వల్పంగా 73,212 యూనిట్లకు పెరిగాయి. మారుతి సుజుకి కార్ల సేల్స్ 41.09 శాతం పెరిగితే, హ్యుండాయ్ 14.59 శాతం, టాటా మోటార్స్ 13.47 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 10.18, కియా మోటార్స్ 5.67 శాతం వృద్ధి నమోదు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News