Monday, December 23, 2024

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవి పొందిన మాజీ శాసన మండలి చైర్మణ్ వి.భూపాల్ రెడ్డిని తన నివాసంలో ఆదివారం కలసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి పనిచేసిన నాయకులందరికీ సముచిత స్థానం లభిస్తుందన్నారు. భూపాల్ రెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గంతో మంచి సంబంధాలు కలిగిఉన్నాయన్నారు. గుర్తింపు ఉన్న నాయకులకు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. అందుకు నిదర్శనం మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అన్నారు. సౌమ్యుడైన భూపాల్ రెడ్డి తనకు లభించిన పదవిలో మంచి గుర్తింపు పొందుతాని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపిలు యాదగిరి యాదవ్, శ్రీశైలం, నాయకులు దశరత్ రెడ్డి, వెంకట్ రెడ్డిల తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News