Saturday, November 16, 2024

ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు ఓయూ త్రైపాక్షిక ఒప్పదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావటం, మానసికంగా వారిని మరింత శ్రేష్ఠులుగా తీర్చిదిద్దేందుకు ఉస్మానియా విశ్వవిద్యాయం, పోలీసు పరిశోధన-అభివృద్ధి బ్యూరో, ఢిల్లీ జైళ్ల శాఖ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారి అనుపమ నీలేఖర్ చంద్ర, ఐపీఎస్, ఢిల్లీ జైళ్లశాఖ అధికారి హెచ్.పి.ఎస్. శ్రాన్, ఐఏఎస్, ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఉన్నతి ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉస్మానియా విశ్రాంత ప్రొఫెసర్ బీనా చింతలపురి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఖైదీల్లో నేరప్రవృత్తి, అపరాధ భావనను తగ్గించే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

ఉన్నతి అనేది కాగ్నిటివ్ బిహేవియరల్ చేంజ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం 2015లో తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ ఆదేశాల మేరకు ఓయూ సైకాలజీ అధ్యాపకులు ప్రొఫెసర్ బీనా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ విభాగం కింద ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చింది. ఉన్నతి ప్రోగ్రామ్ ద్వారా ఖైదీల్లో నేరప్రవృత్తి తగ్గటమే కాకుండా మానసికంగా వారు ఉన్నత స్థితికి చేరుకున్నట్లు రుజువైంది. ఇందుకు జాతీయ స్థాయి గుర్తింపు కూడా లభించింది. దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావటం, జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉన్నతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పోలీసు పరిశోధన-అభివృద్ధి బ్యూరో సహకారంతో ప్రొఫెసర్ బీనా, ఢిల్లీ జైళ్ల శాఖ, తీహార్ జైలు ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావటం ద్వారా నేర భావాలను, నేరపూరిత ప్రవర్తనను తగ్గించటమే లక్ష్యంగా ఓయూతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఎంఓయూ పట్ల ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక శ్రేయస్సు దృష్ట్రా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News