Friday, November 22, 2024

వరదలో కొట్టుకు పోయిన జవాన్లు…మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

జమ్ము : జమ్ములో భారీ వర్షాలకు ముంచుకొచ్చిన వరదలో ఇద్దరు జవాన్లు కొట్టుకుపోగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పూంచ్ జిల్లా సురన్ కోటె లోని డోగ్రా నల్లాను శనివారం ఆర్మీజవాన్లు ఇద్దరూ దాటుతుండగా వరద నీటి ప్రవాహానికి కొట్టుకు పోయారు. వీరిలో ఆర్మీ జవాన్ నయిబ్ సుబేదార్ కుల్‌దీప్ సింగ్ మృతదేహం శనివారం రాత్రి లభ్యం కాగా, మరో జవాన్ లాన్సే నాయిక్ తెలురామ్ మృతదేహం ఆదివారం లభ్యమైంది. పూంచ్ లోని కఠినమైన ఏరియాలో వీరిద్దరూ గస్తీ విధులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగిందని ఆర్మీ అధికార ప్రతినిధులు తెలిపారు.

Also Read: కెసిఆర్ అవినీతి తెలిసినా మోడీ ఎందుకు చర్యలు తీసుకోలేదు

కుల్ దీప్ సింగ్ పంజాబ్ తర్న్ తరుణ్ లోని చబల్ కలాన్ నివాసి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. లాన్స్ నాయిక్ రామ్ హోషియార్ పూర్ లోని ఖురాలి గ్రామానికి చెందిన వారు. పూంచ్ జిల్లాలో పెట్రోలింగ్ సమయంలో లాన్స్ నాయక్ తేలు రామ్ పర్వత ప్రాంతంలో ప్రవాహాన్ని దాటుతుండగా కొట్టుకుపోయాడు. లాన్స్ నాయిక్ తేలు రామ్‌ను రక్షించడానికి చేసిన ప్రయత్నంలో నయిబ్ సుబేదార్ కుల్‌దీప్ సింగ్ కూడా కొట్టుకు పోయాడు. వీరి అత్యున్నత త్యాగానికి ఆర్మీకి చెందిన అన్నిశ్రేణులు సెల్యూట్ చేస్తున్నాయని రక్షణ ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News