న్యూఢిల్లీ : జస్టిస్ పి సామ్ కోషీని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయయూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ న్యాయమూర్తి ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ జడ్జిగా ఉన్నారు. కోషీని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి ద్వారా పంపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన కొలీజియం తెలిపింది. న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, సంజీవ్ ఖన్నా , బిఆర్ గవాయ్, సూర్యకాంత్ కూడా సభ్యులుగా ఉన్న కొలీజియం ఆదివారం నాటి భేటీలో ఈ నిర్ణయం తీసుకుని ఈ మేరకు కేంద్రానికి తమ సిఫార్సు పంపించింది. తొలుత కోషీని మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పంపించడానికి కొలీజియం సిఫార్సు చేసింది. అయితే తనను ఈ రాష్ట్రానికి కాకుండా వేరే ఏ రాష్ట్రానికి పంపించినా ఫర్వాలేదని ఆయన కోరుకున్నారు. దీనిని పరిశీలించి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపించేందుక మార్గం సుగమం అయింది.
సామ్ కోషీ తెలంగాణ హైకోర్టు సిజె సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
- Advertisement -
- Advertisement -
- Advertisement -