- Advertisement -
సాహిత్య అకాడమీ చైర్మన్ – జూలూరు గౌరీ శంకర్
హైదరాబాద్ : ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే కుల, మత భావజాలాలకు దూరంగా వుండాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలోఆదివారం సారస్వత పరిషత్‌లో జరిగిన 121వ జాతీయ కవి సమ్మెళానానికి ముఖ్య అతిథిగా హాజరైన జూలూరు మాట్లాడుతూ కవులు భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంచే కవిత్వం అందించాలని కోరారు.
నేటి సమాజంలో ఇంకా మనుషులపై మూత్రం పోయటం అమానవీయమని ఇలాంటి ఘటనలను తిప్పికొట్టి మనుషుల మధ్య ఐక్యత ను పెంచే విధంగా కలాలు, గళాలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్ జాతీయ ఛైర్మన్ కే ప్రతాప్, రాష్ట్ర అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర సతీష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -