Monday, December 23, 2024

ఉత్తరాదిపై ‘జలఖడ్గం’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరభారతంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఉత్తరాది రా ష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆకస్మాత్తుగా వరదలు ముంచుకొచ్చి, కొండచరియలు వి రిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించినట్టుగానే ఆదివా రం అనేక ప్రాంతాల్లో కొంచరియలు విరిగిపడి, వరదలు ముంచుకొచ్చి మొత్తం 15మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని యమునా పాటు అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల నగరాలు, పట్టణాల్లో రోడ్లన్నీ జలమయమై మోకాలి లోతున వరద నీరు ప్రవహిస్తోంది. కొండప్రాంతాల్లోని రోడ్లు తుడిచిపెట్టుకు పోవడంతో అనేక మంది వరదనీటిలో చిక్కుకుని ఉన్నారు. వాతావరణం మెరుగైన తరువాత టూరిస్టులు తమ ప్రయాణాన్ని సాగించాలని అధికారులు హెచ్చరించారు.

రైల్వే స ర్వీస్‌లపై కూడా వర్షాల ప్రభావం పడింది. ఉత్తరాది లోని 17 రైళ్ల సర్వీస్‌లను రద్దు చేశారు. మరో 12 రైళ్లను మళ్లించారు. నీరు నిల్చి ఉండడంతో నాలుగు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో ము నిగిన ఇళ్లల్లో చిక్కుకున్న ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బం ది రక్షించారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో వ ర్షాలకు ఓ ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 41 ఏళ్లలో  కనీవినీ ఎరుగని స్థాయిలో ఒకేరోజు 153 మి.మీ వర్షపాతం నమోదైంది. 1982 తరువాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం ( ఐఎండి ) పేర్కొంది. ఈ సీజన్‌లో కురవాల్సిన మొత్తం వర్షంలో ఇది 15 శాతానికి సమానం. గత 24 గంటల్లో ఢిల్లీలో ఆదివారం ఉదయం 8.30 గంటల సమయానికి 153 మిమీ వర్షం నమోదైంది.

చండీగడ్‌లో 322 మిమీ, హర్యానా లోని అంబాలాలో 224.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఢిల్లీ లోని ఓ ప్రాంతంలో ఇంటి పైకప్పు కూలి 58 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఢిల్లీ లోని పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్లు, ఆస్పత్రి ప్రాంగణాలు, మాల్స్, నీట మునిగాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. అత్యవసర సేవల విభాగాల్లో వారాంతపు సెలవులను రద్దు చేశారు. ఢిల్లీ లోని స్కూళ్లకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం శెలవు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో కౌశాంబిలో చెట్టు కొమ్మ ఇంటిపై పడి పదేళ్ల బాలిక మృతి చెందింది.
పంజాబ్, హర్యానాలో
పంజాబ్, హర్యానాలో అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. బాధిత ప్రాంతాల్లో వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని పంజాబ్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని హెచ్చరించి రంగం లోకి దింపింది. హర్యానాలో మర్కండ, ఘగ్గర్, తంగ్రి నదులు ఉప్పొంగి ప్రమాద స్థాయిని మించి ప్రవహించడంతో వరద నియంత్రణ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గురుగ్రామ్ లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్పొరేట్ కార్యాలయాల సిబ్బంది ఇళ్ల వద్దనే సోమవారం నుంచి పనిచేయాలని అధికారులు సూచించారు. స్కూళ్లకు సోమవారం శెలవు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News