- కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
ఘట్‌కేసర్: బిఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ పాలనలో ప్రచారం తప్ప చేసిన అభివృద్ది ఏమిలేదని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఉపాధ్యక్షడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ ఎన్‌టిపిసి చౌరస్తాలో మున్సిపాలిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన గొంతుతడపనీ కృష్ణా నీళ్ళ నిరసన దీక్ష కార్యక్రమంలో వజ్రేష్ యాదవ్ పాల్గోని మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడి చేసిందే తప్ప ప్రజలకు ఓరగబెట్టింది ఏమి తేలని విమర్శించారు.
ఇంటింటికి తాగు నీరు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నేటికి ఏ ఒక్క గ్రామంలోనైనా పూర్తి స్థాయిలో కృష్ణా నీళ్ళు అందించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కట్టిన వాటర్ ట్యాంక్‌లకు మిషన్ భగిరథ రంగులు వేసి అభివృద్ధి చేశామని ప్రజలను మోసం చేస్తున్నారని, నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి చేసిన అభివృద్ధి ఏమిలేదని, నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు ఇంటింటికి నీళ్ళు అం దిస్తే ఈ నిరసన చేయాల్సిన అవసరం ఏందుకు వస్తుందని అన్నారు.
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలలోకి తీసుకెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చ ల్ జిల్లా కో ఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్, నాయకులు ఇటిక్యాల కృష్ణా రెడ్డి, మెట్టు గణేష్ యాదవ్, దేవేందర్, శ్రీశైలం, రమేష్‌గౌడ్, ఎర్ర రాజు, విజయ్, రమేష్, వరికుప్పల వెంకటేష్, సయ్యద్ ఇస్మాయిల్, యువజన కాంగ్రెస్ నాయకులు బద్దం మల్లికార్జున రెడ్డి, సీనియర్ నాయకులు కొంతం శంకర్ రెడ్డి, పోలగోని సహదేవ్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, ఈగ కృష్ణ, గంధం రమేష్, తదితరులు పాల్గొన్నారు.