Monday, December 23, 2024

ఫైనల్లో లక్షసేన్

- Advertisement -
- Advertisement -

కాల్గేరీ : కెనడా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్యసేన్ టైటిల్ పోరుకుకు చేరుకున్నాడు. జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటొపై వరుస గేమ్‌లతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టాడు. ఇక మహిళల డబుల్ ఒలింపిక్ టైటిల్స్ విజేత పివి సింధు సెమీఫైనల్లోనే ఇంటిదారుఇ పట్టింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో లక్ష్యసేన్ 11వ ర్యాంక్ కెంటా నిషిమోటొను 21-17, 21-14 తేడాతో మట్టికరిపించి తుదిపోరుకు సిద్ధమ్యాడు. లక్ష్య సేన్ ఫైనల్‌లో చైనాకు చెందిన లిషి ఫెంగ్‌తో అమితుమీకు దిగనున్నాడు. కాగా, వీరిరువురికి 4-2 హెడ్-టు-హెడ్ రికార్డు కూడా ఉంది.
హోరాహోరీగా సాగిన మహిళ సింగిల్స్‌లో ప్రపంచ టాప్ ర్యాంకర్ అకానె యమగుచి చేతిలో పివి సిం ధు పరాజయంపాలైంది. సెమీ-ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై 14-21, 15-21 తేడాతో పివి సింధు ఘోరపరాభావాన్ని మూటగట్టుకుంది. సింధుపై యమగూచికి ఇది 11వ విజయం. గతంలో యమగూచిపై భారత షట్లర్ పీవీ సింధు 14 మ్యాచ్ లు గెలిచిన రికార్డ్ ఉంది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత సింధు గాయపడగా.. తర్వాత కోలుకుని 2022 కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఇప్పటి వరకూ తొమ్మిది టోర్నమెంట్లు ఆడిన సింధూ.. ఐదు టోర్నమెంట్లలో మొదటి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టింది. సింధు ఈ ఏడాది మొత్తం 26 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 14 మ్యాచ్‌లలో గెలుపొంది, 12 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఎలాగైనా టైటిల్ నెగ్గాలనే అత్రుతతో ఉన్న సింధుకు ఫామ్‌లేమితో వరుస ఓటములు వెంటాడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News