Sunday, November 24, 2024

ముస్లింల సమస్యలు పరిష్కరించాలి : హరగోపాల్

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట: ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారికి ప్రభుత్వం తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ప్రొఫెసర్ హ రగోపాల్ కోరారు. సోమాజిగూడ ప్రెబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రూపొందించిన ముస్లిం డిక్లరేషన్‌ను ప్రొఫెసర్ హరగోపాల్, సియాసత్ ఉర్దూ డైలీ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ ఖాన్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుక బడిన ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు.

వారి జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రభుత్వ విద్యా ఉద్యోగాల్లో రిజర్వే షన్లు పెంచాలని, బడ్జెట్లో మైనార్టీల సంక్షేమం కోసం రూ. 10వేల కోట్లు కేటాయించాలన్నారు. ప్రస్తుతం కేంద్రం కామన్ సివిల్ కోడ్ చట్టాన్ని తీసుకురావాలన్న కుట్రను చేస్తుందని, ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. ఈ సమావేశంలో జేఎసీ కన్వీనర్ సయ్యద్ సలీం పాషా, కో కన్వీనర్ స్కై బాబా, శేఖర్ మహ్మద్ యూనస్ కోర్ కమిటీ సభ్యులు ఖలిదా పర్వీన్, ప్రొఫెసర్ అన్సారీ, షేక్ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News