Monday, December 23, 2024

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు : గాంధీ

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగా అన్ని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాస్థానంలో ఏర్పాటు చేసిన బోనాల ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హజరై పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండగ అన్నారు. బోనాల పర్వదినం సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికి బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు.

అమ్మవా రి దీవెనలతో ప్రజలంత సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని ప్రతిగుడికి బోనాల నిధులు మంజూరయ్యేలా కృషి చేశానన్నా రు. బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకా ల వసతుల కలిపిస్తూ ప్రశాంత వాతావరణంలో కలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మనోహర్‌గౌడ్, రాజేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News