Monday, November 18, 2024

నరేంద్రమోడి వరంగల్ పర్యటనతో బిజెపిపై పెరిగిన నమ్మకం

- Advertisement -
- Advertisement -

బాలాపూర్:ప్రధానమంత్రి నరేంద్రమోడి గత శనివారం వరంగల్ నగరంలో నిర్వహించిన పర్యటనతో పాటు భారీబహిరంగ సభ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలకు బిజెపిపై మరింత నమ్మకం పెరిగిందని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు ఆదివారం బడంగ్‌పేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్‌లో రూ.6100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నరేంద్రమోడి శంఖుస్ధాపనలు,ప్రారంభోత్సవాలు చేయడంతో రాష్ట్రంలో కెసిఆర్ కొనసాగిస్తున్న అవినీతి,కులుంబపాలనలకు చరమగీతం పాడడం ఒక్క బిజెపితో మాత్రమే సాధ్యం అన్ని నమ్మకం తెలంగాణ సమాజంలో కనిపిస్తుందని అన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా పేదప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం వేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మించగా దీంట్లో భాగంగా మొదటి విడతగా 2.60 గృహాల నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.కాగా ఈ నిధులతో కేవలం 30 వేల ఇండ్ల నిర్మాణాలు మాత్రము చేపట్టిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం మిగిలిన నిధులను పక్కదారి పట్టించి,రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ఇండ్లు నిర్మిస్తున్నట్లుగా డాంభికాలకు పోతుందని మండిపడ్డారు.రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉన్నామని,అభివృద్ధి,సంక్షేమ పధకాలకు సంబంధించిన పూర్తిస్ధాయి డిపిఆర్‌లతో పాటు దరఖాస్తుదారుల జాబితా వివరాలను సమర్పించాల్సిందిగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు,ప్రధాన కార్యదర్శుల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఙప్తి చేసినప్పటికీ డిపిఆర్‌లు,దరఖాస్తు,లబ్దిదారుల వివరాల జాబితాలను కేంద్రానికి సమర్పించడంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని ధ్వజమెత్తారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి జవాబుదారితనం లేకపోవడం,అసమర్ధతల కారణంగా రాష్ట్రానికి మంజూరు కావాల్సిన లక్షలాది ఇండ్లను ఇక్కడి పేదప్రజలు నష్టపోవాల్సివచ్చిందని ఆరోపించారు.అదేవిధంగా మహారాష్ట్ర,కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,ఛత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుండి లక్షలాది ఇండ్లను తీసుకుంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మాత్రం రాష్ట్రప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత బేషజాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాడని ఈ సందర్భంగా శంకర్‌రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News