Saturday, December 21, 2024

నందిగామలో పెళ్లి చేసుకోవడంలేదని ప్రియురాలిపై యాసిడ్ దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియురాలు పెళ్లి చేసుకోవడంలేదని ఆమెపై ప్రియుడు యాసిడ్ దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నెల్లూరు జిల్లాలోని కుక్కలగుంట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మణిసింగ్‌ తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఐతవరం గ్రామానికి చెందిన ఓ వివాహిత భర్త చనిపోవడంతో తన కుమారుడితో కలిసి ఉంటుంది.

Also Read: బోనమెత్తిన లష్కర్..

మణిసింగ్‌తో సోషల్‌మీడియాతో సదరు మహిళ పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. మణిసింగ్ టిబి వ్యాధి బారిన పడడంతో అతడికి ఆమె దూరంగా ఉంటుంది. శనివారం సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి ఇంట్లోనే నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు వెళ్తుండగా ఆమెపై వెనక నుంచి యాసిడ్ పోసి పారిపోయాడు. ఈ ఘటనలో ఆమెతో పాటు కుమారుడు, అక్క కుమార్తె స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నందిగామ ఎసిపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. బాధితురాలిని మహిళా కమిషన్ ఛైరపర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News