Thursday, January 16, 2025

పవన్‌ను చూస్తేనే అడపిల్లలు భయపడుతున్నారు: మంత్రి అమర్ నాథ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: నిత్యం జగన్ ప్రభుత్వాన్ని నిందించడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పనిగా పెట్టుకున్నారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు చేశారని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ ఇలానే మాట్లాడితే ప్రజలే చెప్పులు చూపిస్తారని దుయ్యబట్టారు. పవన్ కాకిలెక్కలు ప్రజలు పట్టించుకోరని, సైకోలా మాట్లాడడంతో పాటు హావభావాలు ఉన్మాదిలా ఉన్నాయని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: నన్ను చంపాలనుకున్న వారిని క్షమిస్తున్నా: అక్బరుద్దీన్ ఒవైసీ

కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎంఎల్‌ఎలు అయ్యారని, పవన్ ఎందుకు ఎంఎల్‌ఎ కాలేదనిచురకలంటించారు. గతంలో పవన్ తల్లి, భార్యను అవమానించింది టిడిపి నేతలేనని, జనసేన పార్టీ ఎందుకని, డబ్బులు తీసుకుని ఖర్చు చేయడం ఎందుకు అని గుడివాడ ప్రశ్నించారు. జనసేనను టిడిపిలో విలీనం చేయొచ్చు కదా? అని ఉచిత సలహా ఇచ్చారు. విలీనం చేస్తే విడతులుగా డబ్బు రాదని ఆలోచిస్తున్నావా? అని గుడివాడ ఎద్దేవా చేశారు. పవన్‌ను చూస్తేనే అడపిల్లలు భయపడుతున్నారని, ఇలాను మాట్లాడితే ప్రజలు చెప్పులు చూపిస్తారని పవన్‌పై విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News