Monday, December 23, 2024

హిమాచల్‌లో భారీ వర్షాలు: చిక్కుకుపోయిన వందలాది పర్యాటకులు

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని లహోల్-స్పతి జిల్లాను ముంచెత్తుతున్న భారీ వర్షాల కారణంగా రోడ్డు పక్కన విరిగిపడిన కొండ చరియలను తొలగించే పనులకు అంతరాయం ఏర్పడినట్లు సోమవారం సహాయక సిబ్బంది తెలిపారు. దీంతో దాదాపు 250 మందికి పైగా పర్యాటకులు వివిధ ప్రదేశాలలో చిక్కుకుని ఉన్నట్లు వారు తెలిపారు.

రెండు రోజులుగా చిక్కుకుని పోయున్న దాదాపు 200 మంది పర్యాటకులను ఆదివారం స్పిటి లోయలోని మూన్ లేక్ ప్రాంతం నుంచి తరలించినట్లు వారు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా రోడ్డు మార్గం మూసుకుపోవడంతో వివి ధ హోటళ్లు, ప్రబుత్వ భవనాలలో పర్యాటకులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

లహోల్ లోయలోని సిస్సు గ్రామ సమీపంలోని పాగల్ కాలువను ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పర్యాటకులు, స్థానికులతో ఉన్న రెండు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు చిక్కుకుపోయాయి. ఆకస్మిక వరదల కారణంగా మనాలీ-లేహ్ హైవేపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

మూన్‌లేక్(చందర్‌తాల్), సిస్సు ప్రాంతాలలో చిక్కుకుపోయిన పర్యాటకలతో తమ బృందాలు సంప్రదింపులు జరుపుతున్నాయని, వారికి సమీప ప్రాంతాలలో వసతి సమకూర్చాచమని అదనపు డిజిపి అభిషేక్ త్రివేది తెలిపారు. భారీ వర్షాల కారణంగా మొబైల్ నెట్‌వర్క్ దెబ్బతిందని, దీంతో పర్యాటకులు తమ బంధువులతో మాట్లాడేందుకు స్థానిక పోలీసులు ఏర్పాట్లు చేశారని ఆయన తెలిపారు. పర్యాటకులందరూ సురక్షితంగా ఉన్నారని, విరిగిపడిన కొండ చరియల తొలగింపు పనులు పూర్తయిన వెంటనే రోడ్డు మార్గాల ద్వారా పర్యాటకులను తరలిస్తామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం మంచు కూడా భారీగా కురుస్తోందని, దీని వల్ల రోడ్డు పునరుద్ధరణ పనులకు ఆటంకం ఏర్పడుతోందని ఆయన తెలిపారు. వాతావరణం అనుకూలించిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు. చందర్‌తాల్ వద్ద సహాయక, పేనరుద్ధరణ పనులను పోలీసు సూరింటెండెండ్ మయాంక్ చౌదరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన చెప్పారు.

సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తున చుట్టూ హిమాలయ పర్వతాల నడుమ ఉండే చందర్‌తాల్ సరస్సు కేవంల వేసవిలోనే పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. శీతాకాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News