Saturday, December 21, 2024

మహిళా వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు దారుణం: మంత్రి వేణు

- Advertisement -
- Advertisement -

అమరావతి: వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ కృష్ణ మండిపడ్డారు. మహిళా వాలంటీర్లను పవన్ కల్యాణ్ అవమానించారని, వాలంటీర్లను జనం తన కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని, పవన్‌ను జనం క్షమించరని, జనాగ్రహానికి గురికావాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. మహిళలందరికీ పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని వేణు డిమాండ్ చేశారు.

Also Read: స్కూల్‌లో చెట్టుకు ఉరేసుకున్న డ్రైవర్

ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై రాష్ట్రవాప్తంగా వాలంటీర్లు నిరసన తెలుపుతున్నారు. పవన్ దిష్టిబొమ్మను వాలంటీర్లు దహనం చేశారు. కల్యాణ్‌కు కళ్లు లేవని, తమపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని వాలంటీర్లు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News