Monday, December 23, 2024

క్రీడలతో మానసికోల్లాసం

- Advertisement -
- Advertisement -
  • రేగడిదోస్వాడ ఉప సర్పంచ్ గుండాల శ్రీనివాస్

షాబాద్: క్రీడలు మానసిక ఉల్లాసానిస్తాయని రేగడి దోస్వాడ ఉప సర్పంచ్ గుండాల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రేగడిదోస్వాడ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులతో పాఠశాల ఆవరణలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఆయన క్రీడాకారులకు టీషర్ట్‌లను అందజేశారు.

అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు జట్లుగా ఏర్పడి క్రికెట్ పోటీలను ఆడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువకులలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని యువకులందరు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ పోటీలలో గెలుపొందిన జట్టుకు బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. అదే విధంగా క్రీడలో మంచి ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోనురి శంకరయ్య, (పాల వ్యాపారి సాయిరెడ్డిగూడ), క్రీడాకారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News