Saturday, December 21, 2024

మణిపూర్ హింసాకాండలో 142 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మణిపూర్ హింసాకాండలో 142 మంది మృతి
సుప్రీంకు రాష్ట్రప్రభుత్వం నివేదిక
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా జరుగుతున్న మణిపూర్ హింసాకాండలో మొత్తం 142 మంది మరణించారని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ధర్మాసనం ముందు తాజా నివేదిక సమర్పించింది. ప్రధాన కార్యదర్శి వినీత్ జోషి మాట్లాడుతూ పరిస్థితిని అదుపు లోకి తీసుకు రాడానికి 5995 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 6745 మందిని అదుపు లోకి తీసుకున్నట్టు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం ఆరు కేసులను సిబిఐకి బదిలీ చేసినట్టు తెలిపారు.

మే నుంచి దాదాపు ఐదు వేల ఘటనలు జరిగాయని, ఎక్కువగా ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో అధిక మరణాలు సంభవించినట్టు నివేదిక వెల్లడించింది. పునరావాస శిబిరాల్లో ఉన్న విద్యార్థులను దగ్గర్లోని పాఠశాలలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి కర్ఫూను పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హింసాకాండను అరికట్టేందుకు బాధితులకు పునరావాసం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తాజా నివేదికను సమర్పించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News